![]() |
![]() |
.webp)
ఆహా ప్లాట్ఫారం మీద కాకమ్మ కథలో ఎపిసోడ్స్ మంచి ఫన్నీగా ఉంటున్నాయి. తేజు హోస్టింగ్ కూడా ఫుల్ కామెడీని పంచుతోంది. ప్రతీ వారం ఇద్దరు చొప్పున షోకి తీసుకొచ్చి వాళ్ళతో మస్తీ చేస్తోంది. ఇక రాబోయే వారం యష్మి, ప్రేరణను తీసుకొచ్చింది. ఐతే "ఈ షోకి ప్రేరణ డైరెక్ట్ గా నైటీతో వచ్చేసింది. ఇంట్లో కూర్చుని మాట్లాడినట్లు ఉంటుంది అన్నావ్ గా నైటీ కంటే కంఫర్ట్ నాకు వేరేది లేదు కాబట్టి వేసుకొచ్చేసా" అంది దాంతో తేజు కూడా అవాక్కయ్యింది.."పో వెంటనే డ్రెస్ మార్చుకుని రా" అని పంపించేసింది తేజు.
ఇక ఈ షోలో వీళ్ళను హార్ట్ బ్రేకింగ్ ఇన్సిడెంట్స్ ని చెప్పమని అడిగింది తేజు. "నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మా నాన్న నన్ను కొట్టేవాళ్ళు..ఇది నేను లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేను. అరేయ్ ఇదేంట్రా ఈ స్క్రాప్ పీస్ అని తిట్టేవాళ్ళు." అంటూ యష్మి చెప్తూ బాధపడింది. తర్వాత ప్రేరణ తన లైఫ్ లోని ఇన్సిడెంట్స్ చెప్పింది "నిజంగా ఇప్పటికీ ఎన్నో నిద్ర లేని రాత్రులు గడుపుతున్నా...పేరెంట్స్ ఎంతో కష్టపడతారు. తమకు లేని కంఫర్ట్ లైఫ్ ని పిల్లలకు అందించడం కోసం. ఒక పాయింట్ లో నేను పుట్టాక మా నాన్నకు జాబ్ కూడా లేదు. ఇప్పటికీ ఇంకా ఎన్నో కస్టాలు అనుభవిస్తున్నా" అని చెప్పింది. "ఒక వేళ నువ్వు విలన్ ఐతే నీకు హీరోగా ఎవరు చేయాలనుకుంటున్నావ్ అలాగే ఎలాంటి పంచ్ డైలాగ్ ఉండాలనుకుంటావ్" అని తేజు అడిగింది. "నిఖిల్ హీరోగా ఉండాలి అలాగే నేను నీ మక్కే అని తిట్టాలి" అంటూ యష్మి చెప్పింది. వీళ్లంతా బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కలిసిన ఫ్రెండ్స్. అక్కడ ప్రేరణ, యష్మి, నిఖిల్, పృద్వి బాగా డీప్ ఫ్రెండ్స్ ఇపోయారు. ఎందుకంటే వీళ్లంతా కన్నడ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వీళ్లంతా కలిసి ఉండేవాళ్లు.
![]() |
![]() |